18/10/2025
🏠 వాస్తు శాస్త్రం అనేది కొందరికి నమ్మకం మరి కొందరికి సైన్స్ ఏది ఏమయినా అందులో వాస్తవం ఉందనేది నిజం.పేరు ఏదైనా కావచ్చు కానీ గృహ నిర్మాణ విధానం అనేది ప్రకృతిని అనుసరించి నిర్మించుకొనేది.
ఇల్లు అంటే మనం గడిపే స్థలం మాత్రమే కాదు అది మన జీవితం ప్రతిబింబించే మూలాలు అందులో ఉంటాయి. ఈ మధ్యన మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అంటుండటం వింటున్నాం. దాని అర్ధం అక్కడ ప్రశాంతత ఉందనేది కాదనలేని వాస్తవం. ఇందులో ఇంటికి సంబంధించిన
ప్రతి మూల, ప్రతి గోడ, ప్రతి కిటికీ కూడా మన శరీరం, మనసు, ఆరోగ్యం మీద తన ప్రభావం చూపుతాయి.
అందుకే పూర్వీకులు దిశలతో జీవనశాస్త్రాన్ని కలిపి వాస్తును రూపుదిద్దారు.
ఇది మంత్ర కాదు తంత్రం అంతకన్నా కాదు సైన్స్‌తో కూడిన జీవన పద్ధతి.
☀️ ఆగ్నేయ దిక్కు వంటగది ఎందుకు అక్కడ ఉండాలి?
వంట అంటే కేవలం ఆహారం తయారు చేయడం కాదు అది ఇంటి ఉత్సాహం, శక్తి పుట్టించే మూలం.
అందుకే వాస్తు ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలని చెబుతారు.
సైన్స్ ప్రకారం : ఉదయపు సూర్యకాంతి ఈ దిశలో నేరుగా పడుతుంది.
ఆ కాంతిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు వంటగదిలో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను చంపుతాయి.
దీంతో ఆహారం తాజాగా, గది తేమ రహితంగా ఉంటుంది.
అదే సమయంలో వంటలో ఉత్పత్తి అయ్యే వేడి ఈ దిశలో బయటకు సులభంగా వెళ్లిపోతుంది.
వీటన్నింటి కలయిక ఆరోగ్యం, శుభ్రత, శక్తి సమతుల్యం ఏర్పడుతుంది.
ఈశాన్యం మూల యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే? అక్కడ కాంతి, ప్రశాంతత కలిసి ఉంటాయి.
ఉదయం మొదట సూర్యుడు ఈ దిశను తాకుతూ వస్తాడు, దాని వలన కాంతి కిరణాలు వలన జరిగే ప్రక్రియ
ఆ కాంతి గోడలపై పడినప్పుడు ఇంటిలోని తేమ తగ్గుతుంది, గాలి తాజాగా మారుతుంది.
ఇక్కడ నీటి నిల్వలు, చిన్న తోటలు లేదా ప్రార్థన స్థలం ఉంచడం వల్ల సహజ సమతుల్యం ఏర్పడుతుంది.
సైన్స్ ప్రకారం, ఈ దిశలో తేమ స్థాయి తక్కువగా ఉండటం వల్ల జీవాణువులు తక్కువగా పెరుగుతాయి.
😴 నైరుతి దిక్కులోనే ఎందుకు పడక గదిని ఏర్పాటు చేసుకుంటారంటే, అక్కడ ప్రశాంతతతో కూడిన విశ్రాంతి లభిస్తుంది దీనర్థం గాలి వెలుతురు సమపాళ్ళలో ఉంటాయి ఈ మూలన. అందుకే సుఖ నిద్రకు మంచి మూలని చెప్తారు. వివరంగా చెప్పాలంటే.....
ఇక్కడ సూర్యకాంతి మధ్యాహ్నం తర్వాతే పడుతుంది.
సాయంత్రానికి ఈ ప్రాంతం చల్లగా మారుతుంది.
దీని వల్ల బెడ్‌రూమ్‌కు ఇది శరీరానికి సహజ విశ్రాంతి ఇస్తుంది.
భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ దిశలో సుస్థిరంగా ఉండడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
🌬️ వాయవ్య దిక్కు యొక్క ప్రాముఖ్యత: ఇక్కడ గాలి ప్రవాహం, చలనం గురించి ఎక్కువగా చెప్పాలి.
ఈ దిశలో గాలి ప్రసరణ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది.
అందుకే అతిథి గది, పిల్లల గది లేదా పని గదిని ఇక్కడ ఉంచితే గాలి మార్పిడి సులభం అవుతుంది.
శుద్ధమైన గాలి రావడం వల్ల ఇంటిలో కార్బన్ స్థాయిలు తగ్గి శ్వాసకోశానికి లాభం కలుగుతుంది.
🪟కిటికీలు ఇంటికి ఊపిరి పీల్చే ద్వారాలు
కిటికీ అంటే కేవలం వెలుతురు కోసం కాదు అది ఇంటికి ఊపిరితిత్తిలు.
ఈశాన్యం, వాయవ్య దిశల్లో పెద్ద కిటికీలు ఉంచితే ఉదయపు సూర్యకాంతి మరియు గాలి సులభంగా ప్రవేశిస్తాయి.
నైరుతి దిశలో చిన్న కిటికీలు ఉంచడం వలన సాయంత్రపు వేడి లోపలికి రాదు.
సైన్స్ చెబుతోంది సరైన ఎత్తు, సరైన దిశలో కిటికీలు ఉంచితే ఇంటి లోపలి ఉష్ణోగ్రత 3°C వరకు తక్కువగా ఉంటుంది.
🚪తలుపులు శక్తి ప్రవేశించే మార్గాలు
ప్రధాన తలుపు ఉత్తర లేదా తూర్పు దిశలో ఉండటం ఉత్తమం.
ఈ దిశల్లో గాలి తేమ తక్కువగా, కాంతి సమృద్ధిగా ఉంటుంది.
తలుపులు ఎదురెదురుగా ఉండకూడదు అది గాలి ఒత్తిడిని అసమతుల్యం చేస్తుంది.
సరైన పరిమాణం, సరైన స్థానం ఇవే సైన్స్ చెబుతున్న శాంతి రహస్యాలు.
ఇంటి మధ్య భాగం ప్రాణ వాయువు నిలయం
ఇంటి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంచడం పూర్వీకుల గొప్ప ఆలోచన. ప్రస్తుతం ఆ అవకాశం ఇప్పుడు లేదనుకోండి.పూర్వకాలపు ఇండ్లను చూస్తే మద్యలో ఖాళీ స్థలం అందులో సుగంధ మొక్కలు, పూల మొక్కలను పెంచేవారు.
ఇది ప్రతి దిశ నుండి గాలి, కాంతి సమానంగా లోపలికి రావడానికి దోహదం చేస్తుంది.
అక్కడ చిన్న మొక్కలు ఉంచడం, పచ్చదనం పెంచడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి తగ్గి ఆక్సిజన్ పెరుగుతుంది.
ఇప్పుడు వాస్తును పూర్తిగా కొందరు పండితుల పేరుతోనో లేక వాస్తు విశారద పేరుతోనో లేక పలనా మూలన దేవుడి పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తు అంటే భయపెట్టే నియమాలు కాదు అది ప్రకృతితో కలిసి జీవించడానికి మార్గదర్శకం.
దిశలు మన శరీరానికి, మనసుకు అనుకూలంగా పని చేయడానికి వీలుగా సైన్స్ చెబుతున్న మార్గాలు.
సరైన వాస్తు ప్రణాళికతో నిర్మించిన ఇల్లు వెలుతురు, గాలి, శుభ్రత, శాంతి అన్నీ కలిపి ఒక సజీవమైన గృహం అవుతుంది.
మిత్రులారా మీరు ప్రకృతిని అనుసరించి ఇంటి నిర్మాణ నమూనాను గీయించుకోండి.
సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏.