26/03/2023
సృష్టి విజ్ఞానం - ఉగాది - 2
ఉత్పత్తి కావటం, లయం చెందటం, పునరుత్పత్తి జరగటం ఇలా చక్రం కొనసాగే ఈ లోకంలో కాలం అనే మహా సముద్రంలో ఎక్కడా ఖాళీలు లేవు మహా పర్వతాలు, మహా యుగాలు కూడా కాలం అనే సముద్ర గర్భంలో కలిసి పోక తప్పదు. కాలం యొక్క అతి సూక్ష్మమైనది పరమాణువు మరియు మహత్తరమైన బ్రహ్మ ఆయుష్షు గురించి శుక మహర్షి వివరించి చెప్పారు. ప్రతిదినం, ప్రతి క్షణం కూడా ఖగోళ గతి ఆధారంగా చెప్పబడిందిక్కడ.
ఈ కాల గణన నే క్యాలెండర్ అంటాం. Children britanica volume లో చంద్రమాసం (Lunar month ), సౌర వర్షం (solar year ) గురించి తెలుపబడింది.
క్రీస్తు పూర్వం 753 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన రోమన్ క్యాలెండర్ లోసంవత్సరానికి 10 నెలలే పేర్కొన్నారు. నూను పింపోలియాస్ రాజు వచ్చి అదనంగా రెండు నెలలు కలిపాడు. అవి జానువరియస్, ఫిబ్రవరియస్..
జూలియస్ సీజర్ రాజు వచ్చి 7 వ నెలకు జులై అని పేరు పెట్టగా, ఆగస్టాస్ రాజు వచ్చి,8 వ నెలకు ఆగస్టు అని పేరు పెట్టాడు. అన్ని నెలల రోజులు 30,31 అని క్రమం గా పెట్టి, ఒక ఫిబ్రవరి నెల లోని రోజులు మాత్రం 28,29 కి తగ్గించాడు. ఆ తర్వాత 1582 లో పోప్ గ్రేగోరి XIII క్యాలెండర్ ని సరిచేయగా, కొన్ని దేశాలు, గ్రేగొరియన్ క్యాలెండర్ కి ఆమోద ముద్ర వేశారు.
కాని మన హిందూ జీవన పద్దతిలో రాజులు, మతాధిపతులు ఇలా వ్యక్తుల అభిప్రాయాలకు తావివ్వకుండా, గ్రహ గతుల సూక్ష్మ అధ్యయనం జరిపి, భూమి, చంద్రుడు, సూర్యుడు గమనం ఆధారంగా కాల గణన చేశారు.
* 24 హోరలు ( hours )( పృథ్వీ దినం ).. భూమి తన అక్షం పై గంటకు 1600 కి మీ తన చుట్టూ భ్రమణం చేస్తే 24 గంటలు పడుతుంది. దీన్ని పృథ్వీ దివస్ అంటారు.
* సౌర దివస్ : భూమి సూర్యుని చుట్టూ గంటకు 1 లక్ష కి. మీ వేగంతో పరిభ్రమణం చేస్తున్నది.
* తిథి : చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుని కక్ష్యలో 12 డిగ్రీల చలనమే తిథి అంటారు.
* వారం : భూమికి దగ్గరగా చంద్రుడు వున్నాడు. ఒక్కొక్క గ్రహంలో 24 గంటలో, మొదటి గంట అధిపతి గా ఉంటే, ఆ గ్రహం పేరుతో ఆ దినం చెప్పబడింది. సూర్యుని నుండి సృష్టి మొదలైంది కాబట్టి రవి వారం అంటే ఆదివారం అని పిలుస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం గురువారం, శుక్రవారం, శనివారం ఇలా వారం పద్ధతి ప్రపంచం అంతా మన పద్ధతి నే ఆచరిస్తున్నది.
* పక్షం :అమావాస్య నాడు చంద్రుడు, భూమికి సూర్యునికి మధ్యలో ఉంటాడు. రోజుకు 12 డిగ్రీలు చొప్పున 15 రోజులకు 180 డిగ్రీలు వంతున ఉన్న కారణంగా పూర్ణిమ అంటారు.
పాడ్యమి నుండి పౌర్ణమి - శుక్ల పక్షం, పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణ పక్షం.. ఇలా పిలుస్తారు.
* మాసం : ఆకాశం లో మన ఋషులు 27 నక్షత్రాలు లెక్కించి,గుర్తించి,పేర్లు పెట్టారు.
ఏ నక్షత్రం వద్ద నెల అంతా సాయంత్రం నుండి ప్రాత కాలం వరకు కన్పించి, దేనిలో చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరుతో మాసం ( చాంద్రమాసం ) ఏర్పడుతుంది. చిత్త నక్షత్రం వద్ద ఉంటే, చైత్ర మాసం, విశాఖ నక్షత్రం వద్ద ఉంటే వైశాఖ మాసం అంటారు. ఈ విధంగా 12 నక్షత్రాలు - 12+మాసాలుగా లెక్కించారు.
* ఉత్తరాయణం - దక్షిణాయణం:
సూర్య కిరణాలు భూ మధ్య రేఖ నుండి 23 న్నర డిగ్రీలు ఉత్తర, దక్షిణా నికి లంబంగా పడతాయి. కర్కాట సంక్రాతి వైపు నడిస్తే ఉత్తరాయణం 6 నెలలు మకర సంక్రాతి వైపు నడిస్తే, దక్షిణాయణం 6 నెలలు అని లెక్కించారు.
*సంవత్సరం : భూమి సూర్యుని చుట్టూ 1 గంటకు 1 లక్ష కిమీ వేగం తో 96,60,00,000 కిమీ పొడవైన మార్గన్ని,365 1/4 దినములకు పూర్తి చేస్తుంది దీన్ని సంవత్సరం అంటాం.