24/05/2020
అల్విద ప్రియ రంజాన్
------------------------
ఓ రంజాన్ మాసమా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నావా....
నీ రాకతో ఉబ్బి తబ్బిబైన
నా మనసు నీ విరహాన్ని తట్టుకోలేక పోతుంది...
నువ్వు తోడుంటే పుణ్య కార్యాలు తేలికైపోయాయి...
నీ సహచర్యం లో చెడుగులన్నీ దూరమై పోయాయి...
నీ రాక తో శుభాలు వర్షిన్చాయి...
హృదయాలు పవిత్రమయ్యాయి...
రేయింబవళ్లు దైవ దాస్యం లో గడిచాయి..
నీ వీడుకోలుతో నయనాలు అశ్రు పూరితమై ఉంటే...
మా జీవితాలను చక్కదిద్దిన నీవు,
శవ్వాల్ నెల వంక ను చూపి
నేను వెళ్తేనే కదా ఈద్ అంటూ ఓదార్చి
చిరునవ్వు తో వెళ్లిపోతున్నావా.....
మళ్ళీ నీ రాకై నా హృదయం నిరీక్షిస్తూనే ఉంటుంది...
నా కళ్ళు నీ జ్ఞాపకాలతో చమ్మగిల్లుతూనే ఉంటాయి...
నీ విరహం మనసును కలచివేస్తూనే ఉంటుంది...
నీ కారుణ్య ఛాయలో నన్ను సేదదీర్చేందుకు
తొందరగా తిరిగి వచ్చేయి....
అల్విదా...అల్విదా...ప్రియ రంజాన్ మాసమా...
అల్విదా... **************** S.m basha. Sapthagirinagar chinnamushidiwada pendurthy visakhapatanam.