08/07/2026
🎉 ప్రభుత్వ పాలిటెక్నిక్ బెల్లంపల్లి విద్యార్థులకు మరో గర్వకారణం! 🎉
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా–అక్క మెంటర్‌షిప్ (AI & Digital Learning – AIDL) కార్యక్రమానికి మా కళాశాల నుండి మైనింగ్ ఇంజినీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (EIE) విభాగాలకు చెందిన 74 మంది విద్యార్థులు స్టూడెంట్ ఇంటర్న్స్‌గా ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకం.
విద్యార్థులు Telangana Code Mithra పోర్టల్‌లో నిర్వహించిన 14 గంటల AI & Digital Learning సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఈ అవకాశాన్ని పొందారు.
జూలై నుండి సెప్టెంబర్ 2026 వరకు వీరు మంచిర్యాల మరియు కుమురం భీం–ఆసిఫాబాద్ జిల్లాల్లోని సుమారు 30 ప్రభుత్వ పాఠశాలల్లో 6వ నుండి 10వ తరగతి విద్యార్థులకు AI, Coding, Programming మరియు Digital Learning అంశాలపై శిక్షణ అందించనున్నారు. ఈ సేవల ద్వారా వారికి Community Service Academic Credits కూడా లభించనున్నాయి.
ఈ సందర్భంగా కళాశాలలో ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. దేవేందర్, EIE విభాగాధిపతి శ్రీ బి. వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు శ్రీ ఎ. సురేష్ కుమార్ (లెక్చరర్, ECE) మరియు శ్రీ బి. శ్రీనివాస్ (లెక్చరర్, మైనింగ్ ఇంజినీరింగ్) పాల్గొని విద్యార్థులను అభినందిస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
💐 ఎంపికైన విద్యార్థులందరికీ ప్రభుత్వ పాలిటెక్నిక్ బెల్లంపల్లి తరఫున హృదయపూర్వక అభినందనలు. మీ సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాము.