ShivaSakthi Media

ShivaSakthi Media 📰 24/7 Breaking News
🌍 Trending Stories from India & Across the Globe
🗞️ Real Headlines | Trusted Sources
🕒 Fast. Accurate.
(2)

Updated Daily
🔥 What’s Viral • What Matters
👉 Follow for Instant Updates & Breaking Alerts

05/08/2026

పంచాంగం: 05 ఆగస్టు 2026 (బుధవారం)
సంవత్సరం: పరాభవ నామ సంవత్సరం
అయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష ఋతువు
మాసం: శ్రావణ మాసం (కృష్ణ పక్షం - సప్తమి)
వారం: బుధవారం (సౌమ్యవాసరము)
ప్రత్యేకత: శ్రావణ కృష్ణ సప్తమి
తిథి & నక్షత్రం
తిథి: కృష్ణ పక్ష సప్తమి (రాత్రి 08:14 PM వరకు, ఆ తర్వాత అష్టమి)
నక్షత్రం: అశ్విని (రాత్రి 09:18 PM వరకు, ఆ తర్వాత భరణి)
యోగం: శూల (సాయంత్రం 05:27 PM వరకు, ఆ తర్వాత గండ)
కరణం: విష్టి/భద్ర (ఉదయం 09:07 AM వరకు), ఆ తర్వాత బవ (రాత్రి 08:14 PM వరకు)
సూర్యోదయ/అస్తమయాలు
సూర్యోదయం: 05:56 AM
సూర్యాస్తమయం: 06:36 PM
శుభ సమయాలు
బ్రహ్మ ముహూర్తం: 04:30 AM – 05:13 AM
అభిజిత్ ముహూర్తం: లేదు
విజయ ముహూర్తం: 02:43 PM – 03:35 PM
అమృత కాలం: రాత్రి 10:48 PM – 12:24 AM (ఆగస్టు 6 తెల్లవారుజామున)
అశుభ కాలాలు
రాహు కాలం: 12:16 PM – 01:51 PM
యమగండం: 07:31 AM – 09:07 AM
దుర్ముహూర్తం:11:59 AM – 12:51 PM
గుళిక కాలం: 10:42 AM – 12:16 PM
వర్జ్యం: మధ్యాహ్నం 01:21 PM – 02:57 PM

జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్త

04/08/2026

మహారాష్ట్రలో వరద ప్రవాహం.. ఉజ్జయిని జలాశయానికి పెరిగిన ఇన్‌ఫ్లో
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పూణే జిల్లాలోని ఘోడ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బీమా నదికి ప్రధాన ఉపనది అయిన ఘోడ్‌లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఘోడ్ నది వరద నీరు బీమా నదిలోకి చేరుతుండటంతో ఉజ్జయిని జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

04/08/2026

నటనలోనే కాదు.. సంగీతంలోనూ అదుర్స్‌ పూజాహెగ్డే
అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే మరో టాలెంట్‌తో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె అద్భుతంగా పియానో వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటనతో పాటు సంగీతంలోనూ తన ప్రతిభను చాటుకుంటున్న పూజాహెగ్డేను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

04/08/2026

సుధీర్ బాబు తొలి డిజిటల్ ప్రాజెక్ట్‌ ‘గల్లీ’ షూటింగ్‌ పూర్తి
హీరో సుధీర్ బాబు తన తొలి డిజిటల్ ప్రాజెక్ట్‌ **‘గల్లీ’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. డిజిటల్‌ వేదికగా సుధీర్ బాబు ఎలాంటి కొత్త అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

04/08/2026

సీఎం విజయ్‌, త్రిషపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు
సీఎం విజయ్‌, నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అనంతరం విచారణ నిమిత్తం ఆయనను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

03/08/2026

‘అలియాస్‌ రుక్మిణీ’గా నితిన్‌.. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా

నటుడు నితిన్‌ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మురళీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హీరో నాని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘అలియాస్‌ రుక్మిణీ’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాని వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

03/08/2026

కరిగిపోతున్న హిమాలయాలు.. తీవ్ర ఆందోళనలో శాస్త్రవేత్తలు
వాతావరణ మార్పులు, పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలతో పాటు పర్యాటకం, నిర్మాణ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి మానవ కార్యకలాపాల కారణంగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని హిమాలయ గ్లేషియర్లు వేగంగా కరుగుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గత 5–6 దశాబ్దాల్లో ఈ ప్రాంతంలోని గ్లేషియర్లు 25 నుంచి 30 శాతం వరకు మంచును కోల్పోయినట్లు అంచనా. చిన్న గ్లేషియర్లు మరింత వేగంగా కనుమరుగవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

03/08/2026

తెలుగు సినీ ప్రయాణంలో 25 వసంతాలు..
తెలుగు సినీ పరిశ్రమలో 25 ఏళ్ల అద్భుతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నటుడు గోపీచంద్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన అంకితభావం, పట్టుదల, స్థిరమైన కృషి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ‘భారతవర్ష’ చిత్రంతో మరోసారి తన నటనతో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

03/08/2026

ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం..
బిహార్‌లోని సహర్సా జిల్లా సుపౌల్ భక్తియార్‌పూర్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్–సహర్సా ప్యాసింజర్ రైలులోని ఓ బోగీలో సుమారు 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పింది.

Address

Plot No : 45, 6th Lane, Auto Nagar
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when ShivaSakthi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share